భారతదేశం, ఫిబ్రవరి 16 -- గేమర్స్​కి క్రేజీ న్యూస్​! ఈ ఫిబ్రవరిలో రూ. 20వేల ధరలోపే మంచి గేమింగ్​ స్మార్ట్​ఫోన్స్​ని మీరు మీ సొంతం చేసుకోవచ్చు. పోకో, ఐక్యూ, మోటోరోలా, రియల్​మీ సంస్థలకు చెందిన రూ. 20వేల బడ్జెట్​లోపు బెస్ట్​ గేమింగ్​ స్మార్ట్​ఫోన్స్​ లిస్ఠ్​ని ఇక్కడ తెలుసుకోండి..

పోకో ఎక్స్6 ప్రో గేమింగ్​ స్మార్ట్​ఫోన్​లో 6.67 ఇంచ్​ అమోఎల్ఈడీ డిస్​ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1800 నిట్స్ పీక్​ బ్రైట్​నెస్​ ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 8300 అల్ట్రా ఎస్ఓసీతో పాటు గ్రాఫిక్స్ టాస్క్​లను నిర్వహించడానికి మాలి-జీ615 జీపీయూతో ఇది పనిచేస్తుంది.

ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్)తో కూడిన 64 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్​తో ఎక్స్ 6 ప్రో ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు...