భారతదేశం, సెప్టెంబర్ 17 -- ఇండియాలో ఉన్న బెస్ట్​ సెల్లింగ్​ ఫ్యామిలీ ఎస్​యూవీల్లో టాటా పంచ్​ ఒకటి. ఈ మోడల్​కి టాటా మోటార్స్​ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ని తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. 2021 అక్టోబర్‌లో లాంచ్ అయిన ఈ మోడల్‌కు ఇది మొదటి మిడ్-లైఫ్ అప్‌డేట్. ఆగస్ట్​ 2025లో తొలిసారిగా టెస్ట్ వెహికల్ రోడ్లపై కనిపించగా, తాజాగా మరోసారి టెస్టింగ్ సమయంలో కెమెరాలకు చిక్కింది. టెస్ట్ మోడల్‌ను పూర్తిగా కవర్ చేసినప్పటికీ.. దాని డిజైన్, ఫీచర్స్ గురించి కొన్ని కీలక వివరాలు తెలిశాయి. వాటిని ఇక్కడ తెలుసుకుందాము..

కొత్త స్పై షాట్‌ల ప్రకారం.. టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ డిజైన్ దాని ఎలక్ట్రిక్ వెర్షన్ అయిన పంచ్ ఈవీని పోలి ఉంటుంది! ప్రస్తుతం ఉన్న మోడల్‌లో ఉన్న లేయర్డ్ డిజైన్‌కు బదులుగా, ఈ కొత్త వెర్షన్‌లో ఫ్లాట్‌గా ఉన్న టెయిల్‌గేట్ ప్రొఫైల్‌ను గమనించవచ్చు. అంతేక...