భారతదేశం, మార్చి 22 -- ఇండియాలో లో-కాస్ట్​ 7 సీటర్స్​లో ఒకటి రెనాల్ట్​ ట్రైబర్​. దీనికి ఫ్యామిలీ కారుగా మంచి గుర్తింపు ఉంది. ఈ ట్రైబర్​కిి ఫేస్​లిఫ్ట్​ని సంస్థ ప్లాన్​ చేస్తోంది. ఇక ఇప్పుడు రెనాల్ట్​ ట్రైబర్​ ఫేస్​లిఫ్ట్​పై తొలి టెస్టింగ్​ జరిగింది. అందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి. ఈ సబ్ కాంపాక్ట్ ఎంపీవీలో చాలా మార్పులు ఉంటాయని వీటి ద్వారా తెలుస్తోంది. అప్డేటెడ్​ రెనాల్ట్​ ట్రైబర్​ ఈ సంవత్సరం చివరి నాటికి లాంచ్​ అవుతుందని సమాచారం. కొత్త స్పై షాట్ ఫ్లాట్-బెడ్​పై టెస్ట్ మ్యూల్​ని చూపిస్తున్నాయి.

స్పై షాట్స్​ ఎక్కువగా ఈ బెస్ట్​ 7 సీటర్​ ఎంపీవీ వెనుక భాగాలను వెల్లడిస్తుంది. మొత్తం సిల్హౌట్ అలాగే ఉంటుంది. కానీ కొత్త ట్రైబర్ అప్డేటెడ్​ టెయిల్ లైట్లు, టెయిల్​గేట్, బంపర్లను పొందుతుంది. ఫ్రెంట్ కూడా సూక్ష్మమైన మార్పులను కలిగి ఉంటుంద...