భారతదేశం, సెప్టెంబర్ 24 -- భారత మార్కెట్‌లో తన ఉనికిని మరింత విస్తరిస్తూ అల్ట్రావైలెట్ సంస్థ కొత్త ఎలక్ట్రిక్ బైక్​ని తాజాగా లాంచ్​ చేసింది. దాని పేరు 'ఎక్స్​47 క్రాసోవర్'. ఈ బైక్ ఇంట్రొడక్టరీ ప్రైజ్​ రూ. 2.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. త్వరలో ఈ ధర రూ. 2.74 లక్షలకు పెరగనుంది. కంపెనీ ప్రకటన ప్రకారం.. ఈ ఎలక్ట్రిక్ బైక్ బుకింగ్‌లకు అందుబాటులో ఉంది. డెలివరీలు అక్టోబర్ 25 నుంచి ప్రారంభమవుతాయి.

మొదటి చూపులో ఈ ఎక్స్​47 క్రాసోవర్​ ఎలక్ట్రిక్​ బైక్​.. ఒక అడ్వెంచర్ టూరర్ లాగా కనిపిస్తుంది. దీని హెడ్‌లైట్ డిజైన్ కంపెనీ ఎఫ్​77 మోడల్ నుంచి తీసుకున్నట్లు ఉంది. ఇది సింగిల్-పీస్ సీటుతో కలిపి ఉన్న యాంగులర్ డిజైన్‌తో ఆకట్టుకుంటుంది. బైక్ బాడీని కాస్ట్ అల్యూమినియంతో తయారు చేశారు. రైడర్‌ను గాలి తాకిడి నుంచి రక్షించడానికి ఇందులో ఒక విండ్‌స్క్రీన్ కూడా ఉంద...