Hyderabad, ఏప్రిల్ 3 -- Best Crime Thriller Movies on Aha OTT: క్రైమ్ థ్రిల్లర్ జానర్లో తెలుగుతోపాటు పలు ఇతర సౌత్ ఇండియా భాషల్లో చాలా సినిమాలే వచ్చాయి. వాటిలో కొన్ని ఆహా వీడియో ఓటీటీలో ఉన్నాయి. తెలుగుతోపాటు మలయాళం, కన్నడ, తమిళం డబ్బింగ్, రీమేక్స్ కూడా ఈ ఓటీటీలో చూడొచ్చు. వీటిలో బెస్ట్ అనిపించే టాప్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలేంటో చూడండి.

మలయాళం మూవీ రేఖాచిత్రమ్ తెలుగు వెర్షన్ ఈ ఆహా వీడియో ఓటీటీలో ఉంది. 40 ఏళ్ల కిందటి ఓ మర్డర్ కేసును ఛేదించే పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరిగే స్టోరీ ఇది. ఆ చనిపోయింది ఓ అమ్మాయి కావడంతో ఆమె ఎవరు? ఆమెను చంపిన వాళ్లలో ప్రధాన నిందితుడు ఎవరు? అతన్ని ఎలా పట్టుకుంటారన్నది ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీలో చూడొచ్చు.

సత్యదేవ్ నటించిన ఈ మూవీ గతేడాది నవంబర్ 22న రిలీజ్ కాగా.. డిసెంబర్ 20 నుంచి ఆహా వీడియో ఓటీటీలో స్ట్రీమ...