భారతదేశం, డిసెంబర్ 28 -- 2024 ముగింపు దశకు చేరుకుంది. ఈ ఏడాది భారత ఆటోమొబైల్​ మార్కెట్​లో ఎన్నో కొత్త, అప్డేటెడ్​ వర్షెన్​లు కస్టమర్స్​ని పలకరించాయి. అయితే వీటిల్లో 5 మాత్రం స్టాండౌట్​గా నిలిచాయి! ప్రజలు వీటిపై చాలా ఆసక్తి చూపించారు. ఈ నేపథ్యంలో 2024లో టాప్​ 5 కార్ల వివరాలను ఇక్కడ చూసేయండి..

ఇండియాలో ఈ ఏడాది లాంచ్​ అయిన బెస్ట్​ కార్లల్లో స్కోడా కైలాక్​ ఎస్​యూవీ ఒకటి. ఈ కైలాక్​తో స్కోడా మరోసారి మార్కెట్లో మెరుపులు మెరిపించింది.

కైలాక్ ధరలు రూ.7.89 లక్షల నుంచి రూ.14.40 లక్షల మధ్యలో ఉన్నాయి (రెండు ధరలు ఎక్స్-షోరూమ్) ఇది కేవలం ఒక టర్బో పెట్రోల్ ఇంజిన్​తో అందుబాటులోకి వచ్చింది. ఇది 114 బీహెచ్​పీ పవర్​, 178 ఎన్ఎమ్ టార్క్​ని జనరేట్​ చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్​మిషన్​తో అందుబ...