భారతదేశం, మార్చి 14 -- 2025 టాటా టియాగో ఎన్ఆర్​జీ తాజాగా మార్కెట్​లోకి అడుగుపెట్టింది. లేటెస్ట్​ వర్షెన్​లో కొత్త ఫీచర్లు, స్టైలింగ్ అప్డేట్స్​, కొత్త ట్రాన్స్​మిషన్ ఆప్షన్​ని టాటా మోటార్స్​ ప్రవేశపెట్టింది. 2025 టాటా టియాగో ఎన్ఆర్​జీ ధర ఇప్పుడు రూ .7.2 లక్షల నుంచి రూ .8.75 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. టాప్-స్పెక్ ఎక్స్​జెడ్​ వేరియంట్​లో మాత్రమే లభిస్తుంది. ఎంట్రీ లెవల్ ఎక్స్​టీ వేరియంట్​ని సంస్థ నిలిపివేసింది. 2025 టియాగో మాదిరిగానే, కొత్త టియాగో ఎన్ఆర్​జీ పెద్ద ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్​ పొందుతుంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్​ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..

2025 టాటా టియాగో ఎన్ఆర్​జీ మైక్రో స్టైలింగ్ అప్డేట్స్​తో వస్తుంది. ఇందులో కొత్త మ్యాట్ బ్లాక్ క్లాడింగ్​తో రీడిజైన్ చేసిన బంపర్, ఫ్రెంట్​- రేర్​ భాగంలో మందపాటి సిల్వర్ స్కిడ్​ప్లేట్ ఉన్న...