భారతదేశం, ఏప్రిల్ 4 -- 'టీవీఎస్​ అపాచీ'- ఇండియాలో యువతను ఉర్రూతలూగించిన ఈ బైక్​ బ్రాండ్​ 20ఏళ్లు పూర్తి చేసుకుంది. అంతేకాదు 60లక్షల సేల్స్​ని కూడా సాధించి, బెస్ట్​ సెల్లింగ్​ ప్రాడక్ట్స్​​లో ఒకటిగా నిలిచింది.

భారత దేశ పర్ఫార్మెన్స్​ ఆధారిత 2 వీలర్​ సెగ్మెంట్​లో 2005లో అపాచీ 150తో ఎంట్రీ ఇచ్చింది టీవీఎస్​. స్పోర్టీ లుక్స్​తో కూడిన బైక్​కి యువత నుంచి లభిస్తున్న్ ఆసక్తి, డిమాండ్​కి సంస్థ సమాధానం ఈ అపాచీ. ఆ సమయంలో, సెగ్మెంట్​లోనే కొత్త ఫీచర్స్​తో అందరిని కట్టిపడేసింది.

టీవీఎస్​కి టీవీఎస్​ రేసింగ్​ అనే విభాగం ఉంది. ఈ విభాగం ఆధారంగానే టీవీఎస్​ అపాచీని రూపొందించింది. ఇప్పుడు 60 దేశాల్లో అపాచీని విక్రయిస్తోంది సంస్థ. ముఖ్యమైన అంతర్జాతీయ మార్కెట్లలో నేపాల్, బంగ్లాదేశ్, కొలంబియా, మెక్సికో, గినియా వంటి ఆఫ్రికాలోని ప్రాంతాలు ఉన్నాయి. ఇటీవలి సంవత్సర...