భారతదేశం, ఫిబ్రవరి 14 -- బైక్​ లవర్స్​కి క్రేజీ న్యూస్​! కేటీఎం 390 డ్యూక్​ బైక్​ ధరను సంస్థ తగ్గించింది. ఇప్పటివరకు రూ. 3.13 లక్షల ఎక్స్​షోరూం ధరతో సేల్​ అయిన ఈ మోడల్​, ఇప్పుడు రూ. 2.95 లక్షలకు తగ్గింది. అంటే ఈ మోడల్​పై రూ. 18వేలను సంస్థ తగ్గించింది.

ఈ కేటీఎం 390 డ్యూక్​ బైక్ గతేడాది​ లాంచ్ అయింది. ఇది ఇన్​స్టెంట్​ హిట్​ కొట్టింది! యువతలో ఈ బైక్​కి మంచి డిమాండ్​ ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ధర మరింత తగ్గించడంతో సేల్స్​ కూడా పెరుగుతాయని సంస్థ భావిస్తోంది.

అంతేకాదు న్యూ జెన్​ డ్యూక్ కోసం పర్ఫార్మెన్స్​ని 373 సీసీ నుంచి 398 సీసీకి పెంచింది సంస్థ. ఇది ఇప్పుడు 44.25 బీహెచ్​పీ పవర్​ని, 39 Nm టార్క్​ని జనరేట్​ చేస్తుంది. 6-స్పీడ్ గేర్​బాక్స్​ కొనసాగుతోంది. ఇది చాలా సున్నితంగా పనిచేసే బై- డైరెక్షనల్​ క్విక్‌షిఫ్టర్‌తో వస్తుంది.కేటీఎం 390 డ్యూక్​ల...