భారతదేశం, ఏప్రిల్ 28 -- May 2024 Bank Holidays list : మే 2024కు సంబంధించిన బ్యాంక్​ సెలవుల లిస్ట్​ని ఆర్​బీఐ (రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా) ప్రకటించింది. వివిధ మతపరమైన సెలవులు, వారాంతపు సెలవుల కారణంగా.. దేశవ్యాప్తంగా బ్యాంక్​లు.. మే నెలలో కనీసం 10 రోజుల పాటు సెలవులు తీసుకోనున్నాయి.

ముఖ్యంగా.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తో సహా అన్ని జాతీయ బ్యాంకులు.. 2024 మేలో కనీసం 10 రోజుల పాటు పని చేయవమని కస్టమర్లు గుర్తుపెట్టుకోవాలి. వీటిలో రెండు- నాలుగు శనివారాలు, ఆదివారాలు కూడా ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలకు ప్రాంతీయ పండుగలకు సెలవులు కూడా ఉండవచ్చు. అందుకే.. బ్యాంక్​ సెలవుల లిస్ట్​ని తెలుసుకుని.. అందుకు తగ్గట్టుగా కార్యకలాపాలను ప్లాన్​ చేసుకోవడం ఉత్తమం. చివరి నిమిషంలో అసౌకర్యాలను నివారించడానికి మీరు బ్యాంక్​ సెలవుల లిస్ట్​ని తెలుసుకోవాల్సి ఉంటు...