భారతదేశం, సెప్టెంబర్ 28 -- భారతదేశంలో మతపరమైన పండుగలు, స్థానిక ఉత్సవాలు, జాతీయ సెలవుల కారణంగా సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 5 వరకు, అంటే ఈ సోమవారం నుంచి ఆదివారం వరకు, ఏడు రోజుల పాటు ఏదో ఒక ప్రాంతంలో బ్యాంకులకు సెలవు ఉంది. మీ ప్రాంతంలో ఎప్పుడు బ్యాంకులకు ఎప్పుడు సెలవు ఉంటుందో ఇక్కడ తెలుసుకోండి. మీ బ్యాంకు కార్యకలాపాలకు ఇది ఉపయోగపడుతుంది.

భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్దేశించిన సెలవుల్లో, అలాగే ప్రతి నెలా రెండు, నాల్గొవ శనివారాలు, అన్ని ఆదివారాల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సహా అన్ని బ్యాంకులు మూసి ఉంటాయి.

సెప్టెంబర్ 29- సోమవారం, మహా సప్తమి (దుర్గా పూజలో ఏడో రోజు). అగర్తలా, కోల్‌కతా, గువాహటిలో సెలవు.

సెప్టెంబర్ 30- మంగళవారం, మహా అష్టమి / దుర్గా అష్టమి (దుర్గా పూజలో ఎనిమిదో రోజు). అగర్తలా, భువనేశ్వర్, గువాహటి, ...