భారతదేశం, జనవరి 29 -- Bank Employees: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థల్లో పనిచేసే సిబ్బందికి కేంద్రం షాక్ ఇచ్చింది. బ్యాంకు ఉద్యోగులకు ఇచ్చే రుణాలపై రాయితీలపై కూడా పన్ను వసూలు చేయాలని ఆదాయ పన్ను శాఖ నిర్ణయించడంతో కలకలం రేగింది. ప్రస్తుతం మనుగడలో ఉన్న అన్ని రకాల రుణాలపై పన్ను వసూలు చేయాలని నిర్ణయించడంతో ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపింది.

గతంలో తీసుకున్న రుణాలు ప్రస్తుతం ఈఎంఐలు చెల్లిస్తున్నా వాటికి లభిస్తున్న రాయితీలపై పన్ను లెక్కించారు. ఈ విధానంలో బ్యాంకు ఉద్యోగులకు ప్రస్తుతం లభిస్తున్న రాయితీని ఆదాయం కింద పరిగణించి పన్ను లెక్కించారు. ఫలితంగా ఉద్యోగులు 204-25 ఆర్ధిక సంవత్సరంలో భారీగా పన్ను చెల్లించాలని నోటీసులు అందుకున్నారు. ఉద్యోగులు ఇప్పటికే తీసుకున్న వ్యక్తిగత రుణాలు, హౌసింగ్ లోన్స్‌, వాహన రుణాలు, శాలరీ అడ్వాన్సులు వంటి వాటిపై అయా బ్యాంక...