భారతదేశం, ఏప్రిల్ 6 -- శ్రీరామ నవమి నేపథ్యంలో అయోధ్యలోని రామజన్మభూమి ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. రామ్ లల్లా నుదుటి మీద సూర్య తిలకం కనిపించింది. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలు దేవుడి విగ్రహం నుదుటిపై ప్రకాశించాయి. అదే సమయంలో అర్చకులు బాల రాముడికి పూజలు చేశారు. ఈ అద్భుత ఘట్టాన్ని చూసేందుకు లక్షలాది మంది ప్రజలు అయోధ్యకు తరలివెళ్లారు. అనేక మంది టీవీల్లో ఆ దృశ్యాలను వీక్షించారు.

అయోధ్య రాముడి నుదుటి మీద సూర్య తిలకం దృశ్యాలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి.

2024 జనవరిలో ఈ ఆలయం ప్రారంభం కాగా, అదే ఏడాది శ్రీరామ నవమి నాడు తొలిసారి రాముడి నుదుటి మీద సూర్య తిలకం కనిపించింది.

2025 శ్రీరామ నవమి, సూర్య తిలకం వేడుక నేపథ్యంలో అయోధ్యలో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. 2025 మహాకుంభమేళా సందర్భంగా రద్దీ నియంత్రణకు చేసిన ఆవిష్కరణల నుంచి ప...