భారతదేశం, జనవరి 26 -- టెన్నిస్ గ్రాండ్‍స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‍లో మరోసారి విజేతగా నిలిచాడు ఇటలీ స్టార్ ప్లేయర్ జానిక్ సిన్నెర్. ఫైనల్‍లో సత్తాచాటి వరుసగా రెండోసారి ఈ టోర్నీ టైటిల్ దక్కించుకున్నాడు. నేడు (జనవరి) జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 పురుషుల సింగిల్స్ ఫైనల్‍లో సిన్నెర్ 6-3, 7-6 (7/4), 6-3 తేడాతో రెండో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్‍పై విజయం సాధించాడు. తుదిపోరులో వరుస సెట్లలో గెలిచి టైటిల్ దక్కించుకున్నాడు 23 ఏళ్ల సిన్నెర్. ఆ వివరాలు ఇవే..

ఈ ఫైనల్ మ్యాచ్‍లో మొదటి నుంచే జర్మన్ ప్లేయర్ జ్వెరెవ్‍పై ఆధిపత్యం చెలాయించాడు సిన్నెర్. తొలి సెట్లో పవర్ ఫుల్ షాట్లతో రెచ్చిపోయాడు. తొలి సెట్‍లో జ్వెరెవ్ సర్వీస్ బ్రేక్ చేశాడు. జోరు కొనసాగించాడు. దీంతో 6-3తో తొలి సెట్‍ను సిన్నెర్ కైవసం చేసుకున్నాడు.

రెండో సెట్‍లో సిన్నెర్, జ్వెరెవ్ మధ్య హోర...