భారతదేశం, మార్చి 25 -- ఇకపై ఏటీఎం నుంచి నగదు విత్ డ్రా చేయడం మరింత భారంగా మారనుంది. ఇంటర్ఛేంజ్ ఫీజులను పెంచాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. మే 1 నుండి ఏటీఎంల నుండి నగదు ఉపసంహరించుకోవడం ఖరీదైనదిగా మారుతుంది. కస్టమర్లు తమ ఉచిత లావాదేవీ పరిమితిని దాటిన తర్వాత ఈ పెంచిన రుసుము వర్తిస్తుంది. మెట్రో నగరాల్లో ఐదు లావాదేవీలు, ఇతర బ్యాంకుల ఏటీఎంలలో నాన్ మెట్రో ప్రాంతాల్లో మూడు లావాదేవీల వరకు ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.

ఉచిత పరిమితి దాటిన ప్రతి లావాదేవీకి కస్టమర్లు అదనంగా రూ.2 చెల్లించాల్సి ఉంటుంది. నాన్ ట్రాన్సాక్షన్ ఫీజును రూ.1 పెంచారు. ఇకపై ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణకు రూ.17 నుంచి రూ.19కి పెరగనుంది. అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి గతంలో ప్రతి లావాదేవీకి రూ.6గా ఉన్న ఫీజు ఇప్పుడు రూ.7 కి పెరిగింది. కొత్త బ్యాంకింగ్ నిబంధనలు క్రెడిట్...