భారతదేశం, ఏప్రిల్ 5 -- సైన్స్​, కామర్స్​తో పోల్చితే ఒకప్పుడు క్లాస్​ 12 ఆర్ట్స్​ అండ్​ హ్యుమానిటీస్​కి పెద్దగా ఆదరణ లభించేది కాదు. అందులో కెరీర్​ ఉండదని చాలా మంది భావించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ విద్యార్థికి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (బీఏ) వంటి సాంప్రదాయ కోర్సులు ఇప్పటికీ అత్యంత ప్రాచుర్యం పొందిన ఆప్షన్​గా ఉన్నప్పటికీ, వారు అన్వేషించగల అనేక ఇతర అవకాశాలు వెలుగులోకి వస్తున్నాయి. వీటిలో చాలా కోర్సులు కేవలం ఆర్ట్స్​కే పరిమితం కాకుండా ఇతర స్ట్రీమ్ ల విద్యార్థులు కూడా అర్హతను బట్టి వాటిని అభ్యసించవచ్చు. ఈ నేపథ్యంలో క్లాస్​ 12 తర్వాత ఆర్ట్స్​లో కనిపిస్తున్న అవకాశాల లిస్ట్​ని ఇక్కడ తెలుసుకోండి. కెరీర్​ని బిల్డ్​ చేసుకునేందుకు ఉపయోగపడతుంది.

బ్యాచిలర్​ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (బీఎఫ్ఏ)

ఉద్యో...