భారతదేశం, సెప్టెంబర్ 10 -- యాపిల్ కంపెనీ తన "ఆ డ్రాపింగ్​" ఈవెంట్‌లో భాగంగా ఐఫోన్​ 17 సిరీస్​తో పాటు ఎయిర్‌పాడ్స్ ప్రో 3ని అధికారికంగా లాంచ్​ చేసింది. ఇప్పటివరకు వచ్చిన ఎయిర్‌పాడ్స్‌లో ఇది అత్యంత అధునాతనమైనది అని కంపెనీ చెబుతోంది! ఈ థర్డ్​ జనరేషన్​ ఎయిర్‌పాడ్స్‌లో ఎన్నో కొత్త ఫీచర్లు, అప్‌గ్రేడ్‌లు ఉన్నాయి. ఎయిర్‌పాడ్స్ ప్రో 2తో పోలిస్తే ఇందులో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ పనితీరు రెట్టింపు అయింది. అలాగే ఐదు రకాల సిలికాన్ ఇయర్‌టిప్ సైజులతో వస్తోంది. యాపిల్ ఆడియో ఉత్పత్తులలో మొట్టమొదటిసారిగా హృదయ స్పందన రేటును (హార్ట్ రేట్ సెన్సింగ్) కొలిచే ఫీచర్ దీనిలో చేర్చడం విశేషం.

ఈ లాంచ్‌తో యాపిల్ ఎయిర్‌పాడ్స్ పాత్రను వినోదం నుంచి ఆరోగ్యం, వెల్​నెస్​ పర్యవేక్షణకు విస్తరించింది. ఇందులో ఉన్న ఆప్టికల్ సెన్సార్.. ఒత్తిడిని పర్యవేక్షించేటప్పుడు లేదా రోజ...