భారతదేశం, మార్చి 3 -- ఆస్కార్ 2025 అవార్డుల్లో అనోరా చిత్రం అదరొట్టింది. ఏకంగా ఐదు అవార్డులను కైవసం చేసుకుంది. ఉత్తమ చిత్రం విభాగంలోనూ ఆస్కార్ పురస్కారాన్ని దక్కించుకుంది. ఆస్కార్ 2025 వేడుక లాస్‍ఏంజిల్స్ వేదికగా నేడు (మార్చి 3) జరిగింది. అంచనాలను దాటేసి అనోరా మూవీ ఏకంగా ఐదు విభాగాల్లో అవార్డులను కొల్లగొట్టింది. బెస్ట్ మూవీ, బెస్ట్ డైరెక్టర్ సహా మరో మూడు పురస్కారాలను గెలుచుకుంది. ఈ హాలీవుడ్ రొమాంటిక్ కామెడీ డ్రామా చిత్రాన్ని ఇప్పుడు ఏ ఓటీటీలో చూడొచ్చంటే..

అనోరా చిత్రం ఆస్కార్ 2025 అవార్డుల్లో బెస్ట్ ఫిల్మ్ పురస్కారం దక్కించుకుంది. బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ స్క్రీన్‍ప్లే, బెస్ట్ ఎడిటింగ్ కేటగిరీల్లో సీన్ బేకర్ అవార్డులు దక్కించుకున్నారు. ఉత్తమ చిత్రంలో కలిపి సీన్ బేకర్ ఈ మూవీకి గాను ఏకంగా నాలుగు ఆస్కార్ అవార్డులు అందుకున్నారు. ఈ చిత్రంలో న...