భారతదేశం, మార్చి 10 -- Annadata Sukhibhava Scheme : రైతులకు ఏడాదికి రూ.20 వేలు పెట్టుబడి సాయంపై వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ నిధులతో కలిపి రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.20 వేలు 'అన్నదాత సుఖీభవ పథకం' కింద అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. మే నెలలో ఈ మొత్తాన్ని రైతులకు అందిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 42 లక్షల మంది రైతులకు పీఎం కిసాన్ సాయం అందిస్తోందన్నారు.

వెబ్ ల్యాండ్ లో నమోదు చేసుకోని రైతులు, కౌలు రైతులకు సాయం అందటం లేదని అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి వివరించారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో కేవలం రూ.7500 మాత్రమే ఇచ్చారని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతీ రైతుకూ పెట్టుబడి సాయం అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు.

"గత ప్ర...