భారతదేశం, ఫిబ్రవరి 1 -- ఏపీలోని రేషన్ కార్డుదారులకు ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోని రేషన్‌ దుకాణాల్లో కిలో రూ.20కే గోధుమ పిండి పంపిణీ చేయనున్నారు. ఇప్పటి వరకు పైలెట్ ప్రాజెక్ట్ కింద కొన్ని అర్బన్ ప్రాంతాల్లో మాత్రమే గోధుమ పిండిని పంపిణీ చేశారు. కానీ ఇవాళ్టి నుంచి అన్ని జిల్లా కేంద్రాల్లోని రేషన్ షాపుల్లోనూ లబ్ధిదారులకు అందజేస్తారు.

ఇదే విషయంపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటన చేశారు. త్వరలోనే డివిజన్, మండల స్థాయి దుకాణాల్లోనూ గోధుమ పిండిని అందజేస్తామని ప్రకటించారు.

బహిరంగ మార్కెట్‌లో కిలో గోధుమ పిండి ధర 60 నుంచి 65 రూపాయల వరకు ఉంటోంది. కానీ ప్రభుత్వం చౌక దుకాణాల్లో కేవలం 20 రూపాయలకే అందిస్తోంది.ముందుగా పట్టణ ప్రాంతాల్లో ఈ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక్కడ వ...