Hyderabad, మార్చి 17 -- Amitabh Bachchan Income: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వయసుతోపాటు ఆదాయం కూడా పెరుగుతోంది. ఒకప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఈ స్టార్.. ఇప్పుడు దేశంలోనే అత్యధిక ట్యాక్స్ కట్టిన సెలబ్రిటీ స్థాయికి చేరుకున్నాడు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో అతని సంపాదన ఏకంగా రూ.350 కోట్లు కావడం విశేషం.

అమితాబ్ బచ్చన్ 82 ఏళ్ల వయసులో యువ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ రెండు చేతులా సంపాదించేస్తున్నాడు. సినిమాలు, ఎండార్స్‌మెంట్లతోపాటు కేబీసీ షోకి ఆతిథ్యమిస్తూ బిగ్ బీ కోట్లలో వెనకేసుకుంటున్నాడు. తాజాగా వచ్చిన ఓ రిపోర్టు ప్రకారం.. ఈ బాలీవుడ్ మెగాస్టార్ ఈ ఆర్థిక సంవత్సరం ఏకంగా రూ.350 కోట్లు సంపాదించడంతోపాటు రూ.120 కోట్లు ట్యాక్స్ కట్టడం విశేషం.

ఈ క్రమంలో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ను వెనక్కి నెట్టి.. దేశంలో అత్యధిక ట్యాక్స్ కట్టిన సెలబ్రిటీగ...