భారతదేశం, మార్చి 1 -- నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమా భారీ బ్లాక్‍బస్టర్ కొట్టింది. 2021లో వచ్చిన ఈ చిత్రం ఆయనకు అదిరిపోయే కమ్‍బ్యాక్ ఇచ్చింది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నట విశ్వరూపం చూపారు. డ్యుయల్ రోల్‍లో అదరగొట్టారు. ముఖ్యంగా అఘోర పాత్రలో పూనకాలు తెప్పించారు. ఇంతటి బ్లాక్‍బస్టర్ సాధించిన అఖండకు సీక్వెల్ వస్తోంది. ఇప్పటికే అఖండ 2 షూటింగ్ కూడా మొదలైంది. తాజాగా ఈ మూవీ గురించి ఆసక్తికరమైన విషయం బయటికి వచ్చింది.

అఖండ 2 షూటింగ్ లోకేషన్ల కోసం హిమాలయాలకు దర్శకుడు బోయపాటి శ్రీను వెళ్లారు. అక్కడ లొకేషన్ల కోసం ప్రస్తుతం అన్వేషిస్తున్నారు. ఈ మూవీని గ్రాండ్ స్కేల్‍లో తెరకెక్కించాలని డిసైడ్ అయిన బోయపాటి.. అందుకు తగ్గట్టే ప్రత్యేకంగా ఉండాలని భావిస్తున్నారు. హిమాలయాల్లో కొన్ని ముఖ్యమైన సీన్లను చిత్రీకరించాలని ని...