భారతదేశం, ఫిబ్రవరి 27 -- Agrigold Assets: ‍ అగ్రిగోల్డ్ వ్యవహారంలో మరో కొత్త కోణం వెలుగు చూసింది. గత కొన్ని నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా అగ్రిగోల్డ్‌ భూముల్లో కలప చోరీ జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అగ్రిగోల్డ్ ఫామ్‌ ల్యాండ్స్‌లో ఉన్న వేల కోట్ల విలువైన ఎర్ర చందనం, శ్రీ గంధం, సుబాబుల్ చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికి తరలించేస్తున్నారు. గత ఆర్నెల్లుగా సాగుతున్న ఈ వ్యవహారంపై ఇప్పటికే ఓసారి ఏలూరు కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. తాజాగా కలప దోపిడీని ఆపాలని అగ్రిగోల్డ్ యాజమాన్యం మరోసారి కోర్టులో ఫిర్యాదు చేసింది.దాదాపు రూ.3500కోట్ల విలువైన వృక్షాలను దోచుకుంటున్నారని, చర్యలు తీసుకోవాలని పిటిషన్ ఫైల్‌ దాఖలైంది.

అగ్రిగోల్డ్ వ్యవహారం వెలుగు చూసి సరిగ్గా పదేళ్లు గడిచాయి. బాధితులకు ఇంత వరకు న్యాయం జరగలేదు. 2014 డిసెంబర్‌ ఖాతాదారులు, డిపాజిటర్లకు డబ్బ...