భారతదేశం, మార్చి 15 -- అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ మూవీ స్ట్రీమింగ్ కోసం ఎదురుచూపులు ఓ రేంజ్‍లో కొనసాగాయి. డిజాస్టర్ మూవీనే అయినా ఆలస్యమయ్యే కొద్ది స్ట్రీమింగ్‍కు ఎప్పుడు వస్తుందా అనే క్యూరియాసిటీ అధికమైంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 2023 ఏప్రిల్‍లో విడుదలై భారీ ప్లాఫ్ అయింది. భారీ అంచనాలతో వచ్చి బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. ఈ ఏజెంట్ చిత్రం సుమారు 23 నెలల తర్వాత ఓటీటీలోకి ఎట్టకేలకు వచ్చింది. ఈ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తోందో ఇక్కడ చూడండి.

ఏజెంట్ మూవీ రెండో రోజుల కింద సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. చాలా మంది ఎంతగానో ఎదురుచూసిన ఈ చిత్రం ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది. ఈ మూవీని సోనీ లివ్‍లో చూసిన కొందరు సోషల్ మీడియా స్పందిస్తున్నారు.

ఏజెంట్ మూవీకి ఓటీటీ స్ట...