Hyderabad, మార్చి 5 -- Agent OTT Release Date: తెలుగు యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఏజెంట్ ఓటీటీ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న అఖిల్ అభిమానులకు గుడ్ న్యూస్. మొత్తానికి ఈ సినిమా రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ఈ విషయాన్ని సోనీ లివ్ ఓటీటీ బుధవారం (మార్చి 5) తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.

సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో అఖిల్ అక్కినేని నటించిన మూవీ ఏజెంట్. ఈ సినిమా రెండేళ్ల కిందట అంటే 2023లో రిలీజైంది. ఎన్నో కారణాల వల్ల ఓటీటీ రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. మొత్తానికి మార్చి 14వ తేదీ నుంచి ఈ మూవీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు సోనీ లివ్ వెల్లడించింది. బుధవారం (మార్చి 5) ఆ ఓటీటీ తన ఎక్స్ అకౌంట్లో పలు ట్వీట్లు చేసింది.

"అలెర్ట్: ఎవరూ సాటిరాని స్పై వచ్చేస్తున్నాడు. మిషన్ బ్రీఫ్: మెరుపు వేగం, ప్రాణాంతకమైన పందేలు.. అల్టిమేట్ యాక్షన్.. అత్యద్భుతమ...