భారతదేశం, జనవరి 31 -- కొన్ని నెలలుగా సాగుతున్న ఊహాగానాల అనంతరం నథింగ్​ ఫోన్​ 3ఏ ఇండియా లాంచ్​పై అధికారిక ప్రకటన వెలువడింది. రాబోయే స్మార్ట్​ఫోన్​ లాంచ్​ డేట్​తో పాటు పలు ఆసక్తికర వివరాలతో కూడిన వీడియోని నథింగ్​ తాజాగా రిలీజ్​ చేసింది. ఈ నేపథ్యంలో ఈ నథింగ్​ ఫోన్​ 3ఏ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

నథింగ్ ఫోన్ 3ఏ స్మార్ట్​ఫోన్​.. భారత కాలమానం ప్రకారం మార్చ్​ 4న మధ్యాహ్నం 3:30 గంటలకు ఇండియాలో లాంచ్ కానుంది. ఇది ఫ్లిప్​కార్ట్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. మైక్రోసైట్ పేజ్​ ఇప్పటికే లైవ్​లో ఉంది. ఈ గ్యాడ్జెట్​కి సంబంధించిన లేటెస్ట్​ అప్డేట్స్​ కోసం ఫ్లిప్​కార్ట్​ పేజ్​లో నోటిఫికేషన్స్​ని సైతం ఆన్​ చేసుకోవచ్చు.

ఇండియాలోని అఫార్డిబుల్​ స్మార్ట్​ఫోన్​ మార్కెట్​లో ఈ నథింగ్ ఫోన్ 3ఏ లాంచ్​ అవుతుందని తెలుస్తోంది. దీని ధర పోటీగా ఉంటుందని...