భారతదేశం, ఆగస్టు 23 -- ఇండియాలో ఎలక్ట్రిక్​ వాహనాలకు ఉన్న డిమాండ్​ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. మరీ ముఖ్యంగా, 2 వీలర్​ ఎలక్ట్రిక్​ వాహనాలకు విపరీతమైన డిమాండ్​ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆటోమొబైల్​ సంస్థలు కొత్త కొత్త ప్రాడక్ట్స్​ని సైతం లాంచ్​ చేస్తున్నాయి. ఇక ఇప్పుడు టీవీఎస్ మోటార్ భారత మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ కొత్త మోడల్ ఆగస్ట్​ 28, 2025న విడుదల కానుంది. దీనికి "టీవీఎస్ ఆర్బిటర్" అని పేరు పెట్టే అవకాశం ఉంది. గతంలో టీవీఎస్ ఈ పేరును ట్రేడ్‌మార్క్ చేయగా.. టీజర్ లో 'O' అక్షరం కనిపించడంతో ఈ ఊహాగానాలు మరింత బలపడ్డాయి. ఈ స్కూటర్ లాంచ్‌ అయిన తర్వాత టీవీఎస్ ఎలక్ట్రిక్ టూ-వీలర్ విభాగంలో ఐక్యూబ్‌ కన్నా తక్కువ ధరలో లభించే అత్యంత సరసమైన మోడల్ అవుతుందని అంచనా!

ప్రస్తుతం...