భారతదేశం, ఫిబ్రవరి 15 -- కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటించిన మ్యాక్స్ చిత్రం గతేడాది డిసెంబర్ 25న థియేటర్లలో రిలీజైంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం తొలి వారం మంచి కలెక్షన్లను దక్కించుకుంది. బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. అయితే, ఆ తర్వాత వసూళ్లలో డ్రాప్ కనిపించింది. ఈ మూవీకి విజయ్ కార్తికేయ దర్శకత్వం వహించారు. మ్యాక్స్ మూవీ స్ట్రీమింగ్‍కు ఎప్పుడు వస్తుందా అని చాలా మంది ప్రేక్షకులు ఎదురుచూశారు. అయితే అంచనాల కంటే ఆలస్యమైంది. ఎట్టకేలకు నేడు (ఫిబ్రవరి 15) మ్యాక్స్ చిత్రం ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది.

మ్యాక్స్ చిత్రం జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. నేటి సాయంత్రం 7.30 గంటలకు ఈ చిత్రం స్ట్రీమింగ్ మొదలైంది. కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఈ చిత్రం జీ5లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది.

జీ కన్నడ టీవీ ఛానెల్‍లోనూ మ్యాక్...