భారతదేశం, ఫిబ్రవరి 2 -- రాయలసీమ బ్యాక్‍డ్రాప్‍లో 'కోబలి' వెబ్ సిరీస్ తెరకెక్కింది. ఈ క్రైమ్ రివేంజ్ థ్రిల్లర్ సిరీస్‍లో రవి ప్రకాశ్ లీడ్ రోల్ చేశారు. ఇటీవలే వచ్చిన ఈ సిరీస్ ట్రైలర్ గ్రిప్పింగ్‍గా, రస్టిక్ యాక్షన్‍తో ఆకట్టుకుంది. దీంతో ఈ తెలుగు సిరీస్‍పై ఇంట్రెస్ట్ పెరిగింది. కోబలి సిరీస్‍కు రేవంత్ లెవక దర్శకత్వం వహించారు. మరో రెండు రోజుల్లో కోబలి సిరీస్ స్ట్రీమింగ్‍కు రానుంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

కోబలి వెబ్ సిరీస్ ఫిబ్రవరి 4వ తేదీన డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. అంటే మరో రెండు రోజుల్లో ఈ సిరీస్ అందుబాటులోకి వచ్చేస్తుంది. ఈ సిరీస్ నుంచి ఇటీవలే లిల్లీ అంటూ ఓ పాటను కూడా రిలీజ్ చేసింది హాట్‍స్టార్.

కోబలి సిరీస్‍లో రవి ప్రకాశ్‍తో పాటు శ్యామల కూడా ప్రధాన పాత్ర పోషించారు. రాకీ సింగ్, వెంకట్, భరత్ రెడ్డి, తరుణ్ రోహిత్, ...