భారతదేశం, మార్చి 30 -- జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము! అనుకోని పరిస్థితులు ఎదురైతే డబ్బు ఖర్చు విపరీతంగా ఉంటుంది. అందుకే మన ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడమే కాదు, ఆరోగ్య బీమా తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. అయితే, మీకు ట్రావెలింగ్​ చేసే అలవాటు ఉంటే, హెల్త్​ ఇన్సూరెన్స్​తో పాటు యాక్సిడెంట్​ ఇన్సూరెన్స్​ కూడా తీసుకోవడం ఉత్తమం. దేశంలో అనేక ప్రమాద బీమాలు ఉన్నాయి. కాగా, పోస్టల్​ డిపార్ట్​మెంట్​ అతి తక్కువ ప్రీమియంతో అధిక మొత్తంలో కవరేజ్​ ఇచ్చే బీమాని ఇస్తోంది. రూ. 520కే రూ. 10లక్షల వరకు ప్రమాద బీమాని అందిస్తోంది. అంతేకాదు ఏడాదికి రూ. 799 చెల్లిస్తే రూ. 15లక్షల వరకు యాక్సిడెంటల్​ ఇన్సూరెన్స్​ని ఇస్తోంది. ఆ వివరాలు..

ఇండియా పోస్ట్​ పేమెంట్స్​​ బ్యాంక్​ ద్వారా కొత్త ప్రమాద బీమా పాలసీని ఇస్తోంది పోస్టల్​ డిపార్ట్​మెంట్​. అధిక ప్రీమియంలు ఉండే ...