భారతదేశం, మార్చి 10 -- మధ్యప్రదేశ్​లో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. సిద్ధి జిల్లాలోని ఎన్​హెచ్​-39పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక ఎస్​యూవీ- ఒక లారీ హై స్పీడ్​లో గుద్దుకున్నాయి. ఈ ఘటనలో ఏడుగురు అక్కడిక్కడే మరణించారు. మరో 14మంది గాయపడ్డారు.

సిద్ధి జిల్లాలోని బహ్రీ గ్రామానికి చెందిన కొందరు.. ఒక ఎస్​యూవీ (తూఫాన్​)లో మైహర్​లోని శారదా ఆలయానికి బయలుదేరారు. ఎన్​హోచ్​-31పై వెళుతుండగా.. ఎదురుగా ఒక సిమెంట్​ లారీ వచ్చింది. రెండు వాహనాలు హై స్పీడ్​లో ఉండగా, ఒకదాన్ని ఒకటి ఢీకొట్టాయి. ఈ విషయాన్ని డీఎస్​పీ గాయత్రీ దేవి వెల్లడించారు.

కాగా ప్రమాదం సమయంలో రెండు వాహనాలు విపరీతమైన వేగంతో వెళుతున్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడిన 14 మందిని సిద్ధి జిల్లా ఆస్పత్రికి తరలించారు. కాగా.. క్షతగాత్రుల్లో తొమ...