భారతదేశం, ఫిబ్రవరి 6 -- వైభవ్ సూర్యవంశీ మరోసారి సునామీ సృష్టించాడు. తనకు ఏ మ్యాచ్ అయినా బాదడమే తెలుసన్నట్లుగా అతడు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 80 బంతుల్లోనే 15 సిక్స్‌లు, 15 ఫోర్లతో 175 రన్స్ చేయడం విశేషం. అతని దూకుడుతో ఫైనల్లో ఇండియా అండర్ 19 టీమ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 411 రన్స్ చేసింది.

సాధారణంగా ఫైనల్ మ్యాచ్ అంటేనే ఒత్తిడి ఉంటుంది. వికెట్ కాపాడుకోవడానికి ఆచితూచి ఆడుతుంటారు. కానీ వైభవ్ సూర్యవంశీ మాత్రం ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. హరారే వేదికగా జరిగిన అండర్-19 ప్రపంచకప్ 2026 ఫైనల్‌లో ఈ టీనేజ్ సంచలనం ఆడిన ఇన్నింగ్స్ క్రికెట్ చరిత్రలో నిలిచిపోతుంది.

ఇంగ్లాండ్ బౌలర్ల ప్లాన్లను తలకిందులు చేస్తూ వైభవ్ బ్యాట్ ఝులిపించాడు. కేవలం 55 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నాడు. ఇది ఏదో ఆవేశంతో ఆడిన ఇన్నింగ్స్ కాదు.. గ్రౌండ్‌లో అన...