భారతదేశం, జూలై 30 -- రష్యా కంచెట్కా ద్వీపకల్పం వెంబడి ఉన్న పసిఫిక్​ మహా సముద్రంలో అత్యంత శక్తివంతమైన, 8.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ విషయాన్ని యూఎస్​ జియోలాజికల్​ సర్వే ధ్రువీకరించింది. భూకంపం పర్యవసానంగా హువాయి సహా పసిఫిక్ మహాసముద్ర ప్రాంతాలకు సునామీ హెచ్చరిక జారీ చేశారు.

యూఎస్​జీఎస్​ ప్రకారం.. రష్యాలోని కంచెట్కా ద్వీపకల్పంలోని పెట్రోపావ్లోవ్స్క్ నుంచి మరింత తూర్పున 85 మైళ్లు (136 కిలోమీటర్లు) దూరంలో, 12 మైళ్ల (19 కిలోమీటర్లు) లోతులో భూకంప కేంద్రం ఉంది.

రష్యా భూకంపం తీవ్రత తొలుత 8.0 అని వెల్లడించిన అధికారులు.. అనంతరం దానిని 8.7కి అప్​గ్రేడ్​ చేశారు. ఆ తర్వాత మళ్లీ 8.8కి మార్చారు.

మరోవైపు రష్యాలో భూకంపం అనంతరం అమెరికన్ అధికారులు అలస్కా వంటి ప్రాంతాలకు సైతం సునామీ అడ్వైజరీని జారీ చేశారు. జపాన్​ ఉత్తర భాగం నుంచి 250 కి.మీ దూరంలో ఈ భూ...