భారతదేశం, సెప్టెంబర్ 28 -- ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో యాపిల్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు షావోమీ సంస్థ తమ సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లు షావోమీ 17 ప్రో, షావోమీ 17 ప్రో మ్యాక్స్​ను చైనా మార్కెట్‌లో ఇటీవలే విడుదల చేసింది. అగ్రెసివ్​ ప్రైజింగ్​, అగ్రశ్రేణి ఫీచర్లతో ఈ కొత్త ఫోన్‌లు యాపిల్ ఐఫోన్ 17 సిరీస్‌కు సవాల్ విసురుతున్నాయి! పూర్తి వివరాల్లోకి వెళిత..

బేస్ మోడల్‌కు 4,499 యువాన్ల (సుమారు $631) ప్రారంభ ధరతో, షావోమీ 17 సిరీస్ ఐఫోన్ 17 కంటే $100కు పైగా తక్కువ ధరకు లభిస్తోంది. తక్కువ ధరలో ఫ్లాగ్‌షిప్-స్థాయి పనితీరు కోరుకునే వినియోగదారులకు ఇది ఆకర్షణీయమైన ఎంపిక!

షావోమీ సీఈఓ, సహ-వ్యవస్థాపకుడు లీ జున్ మాట్లాడుతూ.. ఈ ఫోన్‌ల సామర్థ్యాలను యాపిల్ ఫ్లాగ్‌షిప్ డివైజ్‌లతో నేరుగా పోల్చి చూపారు. పనితీరు, డిస్‌ప్లే నాణ్యత, కెమెరా ఫీచర్లను ఆయన ...