భారతదేశం, ఆగస్టు 30 -- ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మీ ఒక విప్లవాత్మకమైన కొత్త కాన్సెప్ట్ ఫోన్‌ని ప్రదర్శించింది. ఈ స్మార్ట్​ఫోన్ ఏకంగా 15000ఎంఏహెచ్​ బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది. ఇది స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ టెక్నాలజీలో ఒక పెద్ద ముందడుగు అని కంపెనీ పేర్కొంది. గతేడాది ఇదే కంపెనీ 10000ఎంఏహెచ్​ బ్యాటరీతో కూడిన కాన్సెప్ట్ ఫోన్‌ను కూడా ప్రదర్శించింది!

ఈ మధ్య కాలంలో భారత మార్కెట్​లో 7000ఎంఏహెచ్​ బ్యాటరీ లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న ఫోన్‌లు చాలా వచ్చాయి. కొన్ని బ్రాండ్లు 8000ఎంఏహెచ్​ బ్యాటరీ ఫోన్‌లను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయని లీకులు కూడా సూచిస్తున్నాయి. లీక్‌ల ప్రకారం.. రియల్‌మీ కూడా తన 10000ఎంఏహెచ్​ బ్యాటరీ ఫోన్‌ను భారత్‌లో విడుదల చేయాలని చూస్తోంది. కానీ దీనిపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు.

10000ఎంఏహెచ్​ బ్యాటరీ ఫో...