భారతదేశం, సెప్టెంబర్ 27 -- వన్​ప్లస్​ నుంచి మరో ఫ్లాగ్​షిప్​, ప్రీమియం స్మార్ట్​ఫోన్​ లాంచ్​కు రెడీ అవుతోంది. దాని పేరు వన్​ప్లస్​ 15. ఈ గ్యాడ్జెట్​పై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ మొబైల్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

వన్‌ప్లస్ 15 5జీ స్మార్ట్​ఫోన్​ చైనాలో 2025 అక్టోబర్‌లో విడుదలయ్యే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. అయితే, దీనికి సంబంధించి అధికారిక విడుదల తేదీని కంపెనీ ఇంకా ప్రకటించలేదు. గత సంవత్సరాల ట్రెండ్‌లను బట్టి చూస్తే, ఈ కొత్త వన్‌ప్లస్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ప్రపంచ మార్కెట్‌తో పాటు భారతదేశంలో విడుదల కావడానికి 2026 జనవరి వరకు వేచి చూడాల్సి రావొచ్చు!

వన్‌ప్లస్ 15 5జీ డిజైన్‌కు సంబంధించిన వివరాలు ఇటీవల ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ఇది రీడిజైన్ చేసిన బ్యాక్ ప్యానెల్‌ను చూపిస్తోంది. ఈసారి వన్‌ప్లస్ తన సాంప్రదాయ సర్క్యుల...