భారతదేశం, సెప్టెంబర్ 6 -- స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ ఒప్పో ఈ నెలలో కొత్త తరం ఎఫ్ సిరీస్ మోడళ్లను విడుదల చేయనుంది. ఈ సిరీస్‌లో మూడు కొత్త ఫోన్‌లు రానున్నాయి. అవి.. ఒప్పో ఎఫ్31 5జీ, ఒప్పో ఎఫ్31 ప్రో 5జీ, ఒప్పో ఎఫ్31 ప్రో+ 5జీ. ఈ ఫోన్‌ల విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో, వీటి బ్యాటరీ సామర్థ్యం, కలర్​ ఆప్షన్స్​, మన్నిక, ధరల శ్రేణికి సంబంధించిన లీకులు ఆన్‌లైన్‌లో వెలువడ్డాయి. మీరు మంచి ఫీచర్లు, నాణ్యమైన బాడీ ఉన్న మిడ్‌-రేంజ్ ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, ఈ కొత్త ఒప్పో ఎఫ్31 5జీ సిరీస్ విడుదల కోసం వేచి చూడవచ్చు.

లీకులు, పుకార్ల ప్రకారం.. ఒప్పో ఎఫ్31 5జీ స్మార్ట్​ఫోన్​ సిరీస్ సెప్టెంబర్ 12, 2025న భారతదేశంలో విడుదల అయ్యే అవకాశం ఉంది. అయితే, దీనిపై ఒప్పో ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.

టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ తెలిపిన వివరాల ప్రకారం, ఒప్పో ఎఫ్31 సిరీస్ ...