భారతదేశం, అక్టోబర్ 3 -- లావా సంస్థ నుంచి కొత్త స్మార్ట్​ఫోన్​ లాంచ్​కి రెడీ అవుతోంది. అది లావా అగ్ని సిరీస్​లో భాగంగా వస్తోంది. దాని పేరు లావా అగ్ని 4. ఇదొక 5జీ స్మార్ట్​ఫోన్​. దీనికి సంబంధించిన అధికారిక లాంచ్ తేదీని కంపెనీ ఇంకా ప్రకటించనప్పటికీ, పలు లీక్‌లు, ఊహాగానాల ప్రకారం అగ్ని 4 త్వరలోనే భారత మార్కెట్‌లోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. గత అక్టోబర్ 2024లో విడుదలైన అగ్ని 3 మోడల్‌కి సక్సెసర్​గా ఈ కొత్త ఫోన్ వస్తుంది.

ప్రముఖ టిప్‌స్టర్ సుధాన్షు అంబోర్ ఎక్స్​లో పంచుకున్న టీజర్ ప్రకారం, ఈ స్మార్ట్‌ఫోన్ నవంబర్ నెలలోనే భారతదేశంలో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

ధర విషయానికి వస్తే పరిశ్రమ నివేదికల అంచనా ప్రకారం, అగ్ని 4 స్మార్ట్​ఫోన్​ ప్రారంభ ధర సుమారు రూ. 25,000 రేంజ్​లో ఉండొచ్చు. ఈ అంచనా ప్రధానంగా ఫోన్‌లో ఉపయోగించిన చిప్‌సెట్, మునుపటి మ...