భారతదేశం, ఆగస్టు 31 -- చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మీ.. త్వరలో భారతదేశంలో రియల్‌మీ 15టీ పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. ఈ ఫోన్ సెప్టెంబర్ 2న మధ్యాహ్నం 12 గంటలకు భారత్‌లో విడుదల కానున్నట్లు కంపెనీ ఇటీవలే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న రియల్‌మీ 15 సిరీస్‌లో (రియల్‌మీ 15, రియల్‌మీ 15 ప్రో) చేరనుంది. ఈ సందర్భంగా ఫోన్ డిజైన్, కలర్​ ఆప్షన్స్​తో పాటు పలు కీలక ఫీచర్లను కూడా వెల్లడించింది.

ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ ఇండియా ఈ-స్టోర్ సహా కొన్ని ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ నేపథ్యంలో ఈ గ్యాడ్జెట్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ చూసేయండి..

రియల్‌మీ 15టీ స్మార్ట్​ఫోన్​ మూడు రంగుల్లో లభ్యం కానుంది. అవి.. ఫ్లోయింగ్ సిల్వర్, సిల్క్ బ్లూ, సూట్ టైటానియం....