భారతదేశం, జనవరి 31 -- బాలీవుడ్ వెండితెరపై ఒకప్పుడు తన డ్యాన్స్‌తో ఉర్రూతలూగించిన హీరోయిన్ కల్పనా అయ్యర్. ఆమె పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది 'రంభా హో హో హో' పాట. దశాబ్దాలు గడిచినా ఆ పాట క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. తాజాగా ఒక పెళ్లి వేడుకలో ఈ సూపర్ హిట్ సాంగ్‌కు కల్పనా అయ్యర్ అదిరిపోయే స్టెప్పులేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.

కల్పనా అయ్యర్ తన సోషల్ మీడియాలో ఈ డ్యాన్స్ వీడియోను పంచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. "నిన్న రాత్రి జరిగిన సిద్ధాంత్ పెళ్లి వేడుక ఇది. నేను మళ్లీ ఇలా డ్యాన్స్ చేస్తానని ఊహించలేదు. ఒక స్నేహితుడు ఈ క్లిప్ పంపిస్తే చూసుకున్నాను.. నేనేనా ఇలా చేసింది అని నాకే నమ్మకం కలగడం లేదు. చాలా కాలం తర్వాత డ్యాన్స్ చేశాను, ఆ సాయంత్రం నాకు చాలా ప్రత్యేకం" అని కల్పనా అయ్యర్ పేర్కొన్నారు.

ఈ వీడియోలో కల్పనా అయ్యర్ నిండుగా ఊదా రంగు (Purple...