భారతదేశం, ఆగస్టు 13 -- వివో ఇండియా మార్కెట్‌లో తన కొత్త కెమెరా ఫోకస్డ్ స్మార్ట్‌ఫోన్​ని లాంచ్​ చేసింది. దాని పేరు వివో వీ60 5జీ. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్, అమోలెడ్ డిస్‌ప్లే, ఐపీ68/ఐపీ69 వాటర్ రెసిస్టెన్స్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఈ మొబైల్​ ధర, ఫీచర్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

వివో వీ60 5జీ వివిధ వేరియంట్లలో లభిస్తుంది.

ఈ స్మార్ట్​ఫోన్ ప్రీ-బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి. ఆగస్ట్​ 19 నుంచి వివో అధికారిక వెబ్‌సైట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఆఫ్‌లైన్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. ఇది మిస్ట్ గ్రే, మూన్‌లిట్ బ్లూ, ఆస్పిషియస్ గోల్డ్ అనే మూడు ఆకర్షణీయమైన కలర్స్​ లభిస్తుంది.

డిస్‌ప్లే: వివో వీ60 5జీలో 6.77 ఇంచ్​ 120హెచ్​జెడ్​ క్వాడ్-కర్వ్డ్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. దీని పీక్ బ్రైట్‌నెస్ 5,000 నిట్స్ వరకు ఉంట...