భారతదేశం, ఆగస్టు 17 -- ఇన్ఫీనిక్స్ తన బడ్జెట్ ఫోకస్డ్ హాట్ సిరీస్​లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ కొత్త డివైజ్ పేరు హాట్ 60ఐ. ఈ ఫోన్ ఐపీ64 రేటింగ్, 6,000ఎంఏహెచ్​ బ్యాటరీ, డైమెన్సిటీ 6400 ప్రాసెసర్, 120హెచ్​జెడ్​ డిస్‌ప్లే, 50ఎంపీ ప్రైమరీ కెమెరా వంటి ఫీచర్లతో వచ్చింది. దీని ధర కేవలం రూ. 10,000 లోపే ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ విశేషాలను ఇక్కడ తెలుసుకోండి..

ఇన్ఫీనిక్స్ హాట్ 60ఐ 5జీ ఫోన్ ఒకే వేరియంట్‌లో లభిస్తుంది. 4జీబీ ర్యామ్- 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 9,299. అయితే, మొదటి రోజు అమ్మకాల్లో ప్రీపెయిడ్ కార్డులపై రూ. 300 తగ్గింపు ఉంది. దీనితో ఈ ఫోన్ ధర రూ. 8,999కి లభిస్తుంది.

ఈ బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్ ఆగస్ట్​ 21వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్, రిటైల్ ఓట్​లెట్స్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంటు...