భారతదేశం, ఆగస్టు 10 -- మంచి స్మార్ట్​ఫోన్​ కొనేందుకు ఇప్పుడు ఎక్కువ ఖర్చు చేయాల్సిన పని లేదు! బడ్జెట్​ రేంజ్​లోనే మంచి మంచి ఫీచర్స్​, లాంగ్​ బ్యాటరీతో మార్కెట్​లో అనేక గ్యాడ్జెట్స్​ అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ మీరు కొత్తగా స్మార్ట్​ఫోన్​ తీసుకోవాలని చూస్తుంటే.. ఇది మీకోసమే! తక్కువ ధరకు లభిస్తున్న కొన్ని బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్స్​ వివరాలను ఇక్కడ చూసేయండి..

పోకో ఎం6 ప్లస్​- ఈ స్మార్ట్​ఫోన్​లో క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 4 జెన్​ 2 ప్రాసెసర్​ ఉంటుంది. 120హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 6.79 ఇంచ్​ ఎల్​సీడీ డిస్​ప్లే దీని సొంతం. ఈ మొబైల్​లో 108ఎంపీ+2ఎంపీ రేర్​ కెమెరా లభిస్తుండటం విశేషం. సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం 13ఎంపీ ఫ్రెంట్​ కెమెరాను సంస్థ అందించింది. అమెజాన్​లో పోకో ఎం6 ప్లస్​ 8జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​ వేరియంట్​​ ధర ప్రస్...