భారతదేశం, నవంబర్ 9 -- ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో వరుసగా ఎనిమిది సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా మేఘాలయకు చెందిన ఆకాశ్ కుమార్ చౌదరి రికార్డు సృష్టించాడు. అరుణాచల్ ప్రదేశ్ తో రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్ మ్యాచ్ లో కేవలం 11 బంతుల్లో ఫిఫ్టీ బాదాడు. అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీని నమోదు చేశాడు.

ఆదివారం (నవంబర్ 9) అరుణాచల్ ప్రదేశ్ తో రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్ మ్యాచ్ లో మేఘాలయ తరపున 8వ స్థానంలో బ్యాటింగ్ చేసిన 25 ఏళ్ల చౌదరి రెండో రోజు సికె పిథావాలా గ్రౌండ్ లో ఈ అద్భుత ఘనత సాధించాడు. అతను 14 బంతుల్లో 50 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. మేఘాలయ 6 వికెట్లకు 628 పరుగులతో తమ మొదటి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేయడానికి సహాయపడ్డాడు.

11 బంతుల్లో అర్ధశతకంతో ప్రపంచ రికార్డు నమోదు చేశాడు ఆకాశ్ కుమార్. 2012లో ఎసెక్స్ తో జరిగిన మ్యాచ్ లో లీసెస్టర్ షైర్ కు చెందిన వేన్ వైట్ 1...