Hyderabad, సెప్టెంబర్ 5 -- యూట్యూబ్‌లో పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు, సినిమా పాటలే హిట్ అవుతాయని ఎవరన్నారు? కొందరు సామాన్యులు కొన్ని నెలల కిందట క్రియేట్ చేసిన ఓ ఫోక్ సాంగ్ ఓ ఊపు ఊపేప్తోంది. ఏకంగా ఏడు నెలలుగా టాప్ ట్రెండింగ్ మ్యూజిక్ వీడియోల్లో ఒకటిగా ఉంటూ వస్తోంది. ఇప్పటికే 51 కోట్లకుపైగా వ్యూస్ తో దూసుకెళ్తోంది. ఈ పాట పేరు రాను బొంబయికి రాను. ఈ పాట రాసి, పాడిన రాము రాథోడ్ ఇప్పుడు బిగ్ బాస్ 9 తెలుగులోకి అడుగుపెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

రాను బొంబయికి రాను.. ఇదేమీ బ్లాక్‌బస్టర్ సినిమా పాట కాదు. పాడినోళ్లు, మ్యూజిక్ కంపోజ్ చేసినోళ్లు టాలీవుడ్ లోని టాప్ సెలబ్రిటీలు కాదు. కానీ ఇప్పటికీ ఆ పాట యూట్యూబ్‌లో సంచలనాలు సృష్టిస్తూనే ఉంది. ఈ ఏడాది జనవరి 23న రిలీజైన ఈ సాంగ్.. ఈ వార్త రాసే సమయానికి 51.34 కోట్ల వ్యూస్ సాధించింది. యూట్యూబ్ మ్యూ...