భారతదేశం, ఏప్రిల్ 25 -- మోటోరోలా నుంచి కొత్త స్మార్ట్​ఫోన్​ సిరీస్​ అంతర్జాతీయ మార్కెట్​లో లాంచ్​ అయ్యింది. దీని పేరు మోటోరోలా ఎడ్జ్​ 60. ఇందులో మోటోరోలా ఎడ్జ్​​ 60, ఎడ్జ్​ 60 ప్రో గ్యాడ్జెట్స్​ ఉన్నాయి. ఇవి ఎడ్జ్ 50, ఎడ్జ్ 50 ప్రో మోడళ్లకు సక్సెసర్​గా మార్కెట్​లోకి అడుగుపెట్టాయి. కొత్త స్మార్ట్​ఫోన్స్​ అనేక కీలక క్వాలిటీస్​ని పంచుకుంటాయి కాని కొన్ని ఫీచర్స్​ భిన్నంగా ఉంటాయి. రెండు గ్యాడ్జెట్స్​లో వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కోసం ఐపీ 69 రేటింగ్, 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్​తో ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టెమ్ 3ఎక్స్ ఆప్టికల్ జూమ్​ వంటివి ఉన్నాయి.

ఇండియాలో లాంచ్ గురించి అధికారిక ధృవీకరణ లేనప్పటికీ, మోటోరోలా ఎడ్జ్​ 60 ప్రో వేరియంట్ ఈ నెలాఖరులో భారతదేశానికి వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఎందుకంటే మోటోరోలా ఇప్...