భారతదేశం, జూలై 15 -- ఎలాన్ మస్క్ సారథ్యంలోని టెస్లా సంస్థ ఈరోజు, జులై 15న భారతదేశంలో ఘనంగా అడుగుపెట్టనుంది. ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్​లో తన మొదటి షోరూమ్‌ను ప్రారంభించడానికి టెస్లా సిద్ధమైంది. ఈ షోరూమ్ కేవలం కార్ల విక్రయ కేంద్రంగా మాత్రమే కాకుండా.. సందర్శకులు టెస్లా ప్రత్యేక ఫీచర్లు, సాంకేతికతలను తెలుసుకోవడానికి ఒక "ఎక్స్‌పీరియన్స్ సెంటర్"గా కూడా పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో ఇండియాలో టెస్లా లాంచ్​పై 10 ముఖ్య విషయాలను ఇక్కడ తెలుసుకోండి..

2. టెస్లా మోడల్ వై భారతదేశంలో విక్రయానికి అందుబాటులోకి వచ్చే మొదటి టెస్లా కారు అయ్యే అవకాశం ఉంది. దీనిని చైనా నుంచి దిగుమతి చేసుకుంటారు.

3. లాంగ్ రేంజ్ ఆర్​డబ్ల్యూడీ, లాంగ్ రేంజ్ ఏడబ్ల్యూడీ (డ్యూయల్ మోటార్) వెర్షన్లలో లభించే టెస్లా మోడల్ వై ఎస్​యూవీ.. 574 కి.మీ. వరకు అద్భుతమైన రేంజ్‌ను అందిస్తుంది...