భారతదేశం, జూన్ 15 -- గత ఐదేళ్లలో మల్టీబ్యాగర్ రాబడులను అందించిన స్మాల్-క్యాప్ స్టాక్ కెల్టన్ టెక్ సొల్యూషన్స్ (Kellton Tech Solutions) నుంచి ఇప్పుడు ఒక బిగ్​ అప్డేట్​ వచ్చింది! స్టాక్ స్ల్పిట్​, ఫండర్​ రైజింగ్​ ప్రణాళికలను సంస్థ తాజాగా ప్రకటించింది. ఫలితంగా సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఈ స్టాక్​ ఫోకస్​లో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

వారెంట్లను జారీ చేసి కేటాయించడం ద్వారా నిధులు సమీకరించాలని జూన్ 14, 2025 శనివారం జరిగిన కంపెనీ బోర్డు డైరెక్టర్ల సమావేశంలో నిర్ణయించారు. అలాగే, 1:5 నిష్పత్తిలో స్టాక్ స్ల్పిట్​ను సైతం సిఫార్సు చేశారు. ఈ విషయాలపై వాటాదారుల ఆమోదం పొందేందుకు జులై 11, 2025 శుక్రవారం కంపెనీ ఎక్స్​ట్రా- ఆర్డినర్​ జనరల్​ మీటింగ్​ (ఈజీఎం)ని నిర్వహించనున్నారు.

కంపెనీ బోర్డు 1:5 నిష్పత్తిలో స్టాక్ స్ల్పిట్​కు ఆమోదం తెలిపింది. దీని అ...