భారతదేశం, మే 6 -- మీరు మ్యూచువల్​ ఫండ్స్​తో మీ ఇన్వెస్ట్​మెంట్​ జర్నీని ప్రారంభించాలని చూస్తున్నారా? కానీ మార్కెట్​లో ఉన్న చాలా ఆప్షన్స్​లో ఏది ఎంపిక చేసుకోవాలో తెలియడం లేదా? అయితే ఇది మీకోసమే! మ్యూచువల్​ ఫండ్స్​లో పెట్టుబడికి ముందు అనేక విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. సాధారణంగా సంబంధిత ఫండ్​ గత ప్రదర్శనను చూసి, భవిష్యత్తులో ఎలాంటి రిటర్నులు వస్తాయి అనేది అంచనా వేస్తుంటారు. ఈ నేపథ్యంలో 5ఏళ్లల్లో 25శాతం కన్నా అధిక రిటర్నులు ఇచ్చిన 'వాల్యూ' మ్యూచువల్​ ఫండ్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

వాల్యూ మ్యూచువల్ ఫండ్స్ అనేది కనీసం 65 శాతం స్టాక్స్​తో వాల్యూ ఇన్వెస్ట్​మెంట్ స్ట్రాటజీని అనుసరించే స్కీమ్స్. స్టాక్ ఎంపికలో సాధారణంగా అవలంబించే వాల్యుయేషన్ పారామీటర్ల ఆధారంగా ఈక్విటీ ఫండ్లను వర్గీకరించవచ్చు. ఒకటి గ్రోత్ ఫండ్స్- ఇవి మార్కెట్ కంటే మెరుగైన...