భారతదేశం, ఆగస్టు 31 -- ఇటీవల దేశీయ స్టాక్​ మార్కెట్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిలో ఉన్నప్పటికీ, ఐజ్మో (Izmo) షేర్లు మాత్రం తమ లాభాల పరుగును కొనసాగిస్తున్నాయి. ఉత్తర అమెరికా, యూరప్, ఆసియాలోని ఆటోమోటివ్ ఇ-రిటైల్ రంగానికి పరిష్కారాలను అందించే ఈ కంపెనీ షేర్లు మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకుని నిలబడటంతో పాటు మంచి వృద్ధిని సాధిస్తున్నాయి.

గత ఐదు ట్రేడింగ్ సెషన్లలోనే ఐజ్మో షేరు ధర రూ.408 నుంచి రూ. 706 వరకు టచ్​ అయ్యింది. ఈ ర్యాలీతో ఆగస్టు నెలలో దాని లాభాలు 84%కి చేరాయి. 2015 జులై తర్వాత ఐజ్మోకు ఇదే అత్యధిక నెలవారీ పెరుగుదల.

దాలాల్ స్ట్రీట్‌లో ఈ స్మాల్‌క్యాప్ షేర్‌కు డిమాండ్ పెరగడానికి అనేక సానుకూల పరిణామాలు కారణమయ్యాయి. ఆగస్టు 21న ఐజ్మో మైక్రో (izmomicro) అనే దాని ప్రత్యేక విభాగం ఒక కొత్త సాంకేతికతను అభివృద్ధి చేసినట్లు కంపెనీ ప్రకటించింది. ఇది సిలిక...